కృష్ణా జిల్లా పామర్రులో సోమవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానిక బస్టాండ్, గఫార్ సెంటర్, గ్రంథాలయం బజారు తదితర ప్రాంతాలు నీటమునిగాయి. గఫార్ సెంటర్లోని దుకాణాల్లోకి వర్షపు నీరు వచ్చి సరుకులు తడిసిపోవటంతో.... వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు నీట మునగటంతో...ప్రజలు బయటకి రావటానికి ఇబ్బంది పడుతున్నారు.
పామర్రులో భారీ వర్షం...ప్రజల ఇక్కట్లు - పామర్రు వార్తలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లా పామర్రులో కుండపోతగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు రాకపోకలకు సాగించటానికి ఇబ్బందులు పడుతున్నారు.
పామర్రులో భారీ వర్షం
ఇదీ చదవండి:అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు