ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణాజిల్లాలో వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు - imd news

కృష్ణా జిల్లా తిరువూరు, గంపలగూడెం మండలాల్లో వాగులు పొంగిపోర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. తిరువూరు - విస్సన్నపేట మార్గం మల్లేల వద్ద వరద నీటి దాటికి లారీ బోల్తా పడింది.

heavy rains
heavy rains

By

Published : Jul 14, 2020, 10:29 AM IST

Updated : Jul 14, 2020, 10:34 AM IST

తిరువూరు, గంపలగూడెం మండలాల్లో పొంగుతున్న వాగులు

కృష్ణాజిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గంపలగూడెం మండలం వినగడప వంతెన పై నుంచి వరద నీరు ప్రవహించటంతో....రాకపోకలు నిలిచిపోయాయి. కట్లేరు, ఎదుళ్లవాగు, పడమటి వాగు, విప్లవాగు, తూర్పు వాగులో వరద ఉద్ధృతి పెరిగింది. తిరువూరు మండలం అక్కపాలెం సమీపంలోని పొలాలు చెరువును తలపిస్తున్నాయి.

తిరువూరులోని సుందరయ్య కాలనీలో వరద నీరు ఇళ్ళలోకి ప్రవేశించటంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. తిరువూరు - విస్సన్నపేట మార్గంలో వరదనీటిలో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్‌, క్లీనర్‌ను స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Last Updated : Jul 14, 2020, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details