ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో 71,821 హెక్టార్లలో పంట నష్టం: వ్యవసాయశాఖ - ఆంధ్రప్రదేశ్​లో వర్షపాతం వార్తలు

వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలు.... రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మొత్తం 71 వేలకు పైచిలుకు హెక్టార్లలోని పంట నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది. మొత్తం 9 జిల్లాల్లో 24 రకాల పంటలు ముంపునకు గురయ్యాయని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది.

crop damage in ap
crop damage in ap

By

Published : Oct 15, 2020, 12:07 AM IST

వాయుగుండం కారణంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల పంట నీట మునిగింది. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, మినుము, చెరకు తదితర పంటలకు తీరని నష్టం వాటిల్లింది. మొత్తం 9 జిల్లాల్లో 71,821 హెక్టార్లలోని పంట నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనాలు రూపొందించింది. అత్యధికంగా ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో పంట ‌న‌ష్టం వాటిల్లిందని అందులో పేర్కొంది. తొమ్మిది జిల్లాల్లో 24 ర‌కాల పంట‌ల‌కు న‌ష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసింది.

వ్యవసాయ శాఖ ప్రకారం పంట నష్టం ఇలా

పంట నష్టం (హెక్టార్లలో)
వ‌రి 54,694
ప‌త్తి 12,047
మినుము 1600
చెరకు 310
వేరుశెనగ 836

క‌డ‌ప జిల్లాలో 476 హెక్టార్లలో ఇసుక మేట‌లు, 53 హెక్టార్లలో భూమి కోత‌తో పంట‌ల‌కు న‌ష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 29,943 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 13,976 హెక్టార్లు, కృష్ణా జిల్లాలో 12,466 హెక్టార్లలోని వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 158 హెక్టార్లలో పంట నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ లెక్కగట్టింది.

ఇదీ చదవండి:

'ఏపీలో పరిస్థితి ఎలా ఉంది?'... సీఎం జగన్​కు ప్రధాని ఫోన్

ABOUT THE AUTHOR

...view details