ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోపిదేవిలో భారీ వర్షం.. పంట పొలాల్లోకి చేరిన నీరు

కృష్ణా జిల్లా మోపిదేవిలో భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు రకాల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్​ స్తంభాలు తెగిపడ్డాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

By

Published : Jul 9, 2020, 5:43 PM IST

heavy rains in mopidevi mandalam
మోపిదేవిలో భారీ వర్షానికి పంట పొలాల్లోకి చేరిన నీరు


కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో భారీ వర్షం కురిసింది. 24 గంటల్లో 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గత ఇరవై రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వంగ, ములక, సొర, బొప్పాయి, దోస పంటల్లో వర్షం నీరు నిలిచి పోవడం వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కూరగాయలు సాగుచేస్తున్న పంట పొలాల్లో వర్షపునీరు బయటకు వెళ్ళే మార్గం లేకుండా పోయింది. కొన్ని చోట్ల రాత్రి వీచిన గాలులకు విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడ్డాయి. అవనిగడ్డ-విజయవాడ కరకట్ట రహదారిపై చెట్లు కూలడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details