గాలికి నేలకొరిగిన అరటి చెట్లు - krishna district heavy rains news
కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో నిన్న రాత్రి వీచిన ఈదురు గాలులకు భారీగా అరటి చెట్లు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట అందకుండానే పోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈదురు గాలులకు నేలకొరిగిన అరటి చెట్లు
కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో నిన్న రాత్రి ఈదురు గాలులు వీచాయి. నాగాయతిప్ప, పోచిగానిలంక గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లోని అరటి చెట్లు నేలకొరిగాయి. ఆరుగాలం పండించిన పంట అందకుండా పోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. గెలలు పక్వానికి వచ్చేలోపే పంటంతా గాలులకు నేలకొరిగాయని కర్షకులు వాపోయారు. నష్టపోయిన తమకు ప్రభుత్వం సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు.