విజయవాడలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలైన రోటరీనగర్, విద్యాధరపురం ప్రాంతాల్లో వర్షపు నీటితో వీధులు మునిగిపోయాయి. తేలికపాటి వర్షాలకే నీరు ఇళ్లలోకి రావటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వర్షం పడిన ప్రతిసారి వీధులు మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టి నీటిని బయటకు పంపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరారు.
విజయవాడలో భారీ వర్షం..ఇళ్లలోకి చేరిన వరద నీరు - taja news of Vijayawada rain
విజయవాడలో రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో నానా అవస్థలు పడుతున్నారు.
heavy rain in Vijayawada roads are blocked with rain water