విజయవాడ నగరంలో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో సాయంత్రం ఐదున్నర గంటల నుంచి గంటకుపైగా ఎడతెరిపి లేని వాన పడింది. దట్టమైన కారుమబ్బులతో వెలుతురు పూర్తిగా తగ్గిపోయి చిమ్మచీకట్లు అలముకున్నాయి.
జనజీవనంపై తీవ్ర ప్రభావం..
సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. ఫలితంగా జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా కురిసింది. బెంజ్ సర్కిల్ వద్ద వాహనాల రాకపోకలకు వాన తీవ్ర అంతరాయం కలిగించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు వర్షంలో తడుస్తూనే తీవ్రంగా శ్రమించారు.