ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎడతెరపిలేని వర్షాలతో అన్నదాతకు తీవ్ర నష్టం - krishna distirict latest updates

కృష్ణాజిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అన్నదాత పరిస్థితి దుర్భరంగా మారింది. వానల వల్ల పంటలు నష్టపోవటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీటిలో తడిసిన మెుక్కజోన్న
నీటిలో తడిసిన మెుక్కజోన్న

By

Published : Oct 15, 2020, 7:04 AM IST



కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరి, మొక్కజొన్న, పత్తి చేలు, అరటి, మామిడి తోటలు సైతం తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. వరి పంటలో కంకులు పాలు పోసుకునే దశలో, గాలి వానలా కారణంగా నేలను తాకడంతో పంటను నిలబెట్టేందుకు రైతు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. వరి చేలలో పంటను నిలబెట్టినప్పటికీ ఎంతవరకు దిగుబడినిస్తాయో అయోమయ స్థితిలో ఉన్నారు రైతులు.

నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం నరసాపురంలో వరి పంటలు పూర్తిగా నేలమట్టామయ్యాయి. రేయింబవళ్ళు శ్రమించి పంటను కాపాడితే, కంకి దశలో నేలపై వాలడంతో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు పూర్తిస్థాయిలో విచారించి సన్న చిన్న కారు రైతులమైన తమను రక్షించాలని వేడుకుంటున్నారు.

ఇదీచదవండి

శరన్నవరాత్రులకు విస్తృత ఏర్పాట్లు.. బెజవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details