కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 24 గంటలు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం నిలకడగా ఉండటంతో- నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు సూచించారు. తిరువూరు నియోజకవర్గంలోని కట్లేరు, ఎదుళ్ల వాగు, విప్లవాగు, పడమటి వాగు, తూర్పు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గుడివాడలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వద్ద కాజ్ వే పై నీరు ప్రవహిస్తోంది. చాట్రాయి మండలం చిన్నంపేట వద్ద తమ్మిలేరు వరద ఉద్ధృతికి... శివాపురం- చిన్నంపేట నడుమ వంతెనకు గండి పడింది.
కృష్ణా జిల్లాలో విస్తారంగా వర్షాలు - heavy rain in krishna district
కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఆదివారం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
విజయవాడలో ఓ మోస్తారుగా కురుస్తున్నవర్షం