కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షపు నీరు బస్టాండులోకి ప్రవేశించడంతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో లోతట్టు ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మున్నేరులో వరద ప్రవాహం మొదలైంది. క్రమక్రమంగా నీటి ఉధృతి పెరిగింది. పోలంపల్లి ఆనకట్ట వద్ద పది అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.