ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు - rain news krishna district

కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. విజయవాడతో పాటు ఇతర మండలాల్లోనూ భారీగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

heavy rain in krishna district
జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు

By

Published : Jul 15, 2020, 11:21 PM IST

కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. విజయవాడతో పాటు ఇతర మండలాల్లోనూ భారీగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నూజివీడు, మైలవరంలో తెల్లవారుజాము నుంచి కుండపోతగా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

మైలవరంలోని దేవుని చెరువు (తారకరామా నగర్) ప్రాంతం లో వర్షపు నీరు నివాసాల మద్య చేరింది. జి.కొండూరు మండలం కుంట ముక్కల క్రాస్ రోడ్ వద్ద కొండవాగు ప్రవాహం ఉదృతమవడంతో రహదారి ని వర్షపు నీరు ముంచెత్తింది. విజయవాడ వెళ్ళే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణీకులకు ఇబ్బందిగా మారింది.

పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పెనుగంచిపోలు, నందిగామ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వల్లూరు మండలం పాములంక కృష్ణానది పాయలోని రహాదారి వరద నీరు కారణంగా గండి పడింది. ఆగిరిపల్లి మండలంలో పలు చోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. నూజివీడు - గన్నవరం ప్రధాన రహదారిలో తోటపల్లి దగ్గర కుంపేనీ వాగు రావడంతో రాక పోకలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి:

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details