ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈదురు గాలులతో వర్షం... నేలరాలిన మామిడి - రాష్ట్రంలో భారీ వర్షాలు

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. చేతికొచ్చిన మామిడి ఈదురుగాలులతో నేల రాలింది. కష్టపడి పండించిన పంట మొత్తం చేజారిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

heavy rain in krishna district
heavy rain in krishna district

By

Published : May 16, 2020, 6:38 PM IST

కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మామిడి కాయల కోత చివరి దశలో ఉన్న సమయంలో గాలులు రావడంతో కాయలన్నీ నేలరాలాయి. కష్టపడి పండించింది చేతికొచ్చేసరికి చేజారిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details