ఈదురు గాలుల బీభీభత్సానికి కృష్ణాజిల్లాలో మామిడి రైతులకు అపార నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లాలో ఒకటిన్నర లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేస్తుండగా.. ఈదురు గాలుల తాకిడికి కోతకు వచ్చిన మామిడి కాయలు పూర్తిగా నేల రాలాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి.. పంట సాగు చేసిన రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మామిడికి ప్రసిద్దగాంచిన తిరువూరు, నూజివీడు, మైలవరం, గన్నవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మామిడి కొమ్మలు విరిగిపడ్డాయి. చెట్లు పడిపోవడంతో మరింత నష్టం వాటిల్లింది.
ఈదురు గాలుల దెబ్బకు నేలరాలిన మామిడి పంట - కృష్ణా జిల్లాలో భారీ వర్షం
కృష్ణా జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. కోతకొచ్చిన మామిడి పండ పూర్తిగా నేల రాలింది. తిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు.. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
heavy rain in krishna district