కృష్ణాజిల్లా మైలవరంలో సాయంత్రం 4 గంటల నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించారు. నూతన ధరలు అప్డేట్ కావటానికి సమయం పట్టడంతో విక్రయాలు ఆలస్యమయ్యాయి. మైలవరం పరిధిలోని అన్ని దుకాణాల్లో అమ్మకాలు ఆలస్యమయ్యాయని... రేపటినుంచి ఉదయం 11 నుంచి సాయంత్రం7 గంటల వరకు అమ్మకాలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ మద్యం కొనుగోలు చేయాలని మైలవరం ఎక్సైజ్ సీఐ పెద్దిరాజు కోరారు.
లేటయినా... మందుతోనే ఇంటికెళ్తాం..! - కృష్ణా జిల్లా వార్తలు
కృష్ణా జిల్లా మైలవరంలో మద్యం కొనుగోలు కోసం మందుబాబులు ఉదయం నుంచే బారులు తీరారు. ప్రభుత్వం ప్రకటించిన నూతన ధరలు ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో మద్యం విక్రయాలు ఆలస్యమయ్యాయి. ఇదిలా ఉండగా మందుబాబులు మండుటెండలో నిలబడుతూ మద్యం కొనుగోలు చేయడం గమనార్హం.
ఆన్లైన్లో నమోదు కాని నూతన మద్యం ధరలు