కృష్ణా జిల్లా కోడూరులో మద్యం దుకాణం ముందు మందుబాబులు గుమిగూడారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా మద్యం కోసం ఎగబడ్డారు. మద్యం దుకాణాల ముందు అధికారులు ఎలాంటి భద్రత చర్యలు చేపట్టకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మందుబాబుల బారులు... కొవిడ్ వ్యాప్తికి దారులు - కోడూరులో మద్యం దుకాణాల ఎదుట బారులు
కృష్ణా జిల్లా కోడూరు మండల వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఉల్లిపాలెం రోడ్డులో ఉన్న మద్యం దుకాణం ముందు మందుబాబులు ఇదేదీ పట్టింపే లేకుండా మద్యం కోసం గుంపులుగా ఎగబడ్డారు. ఫలితంగా కరోనా వ్యాప్తి చెందుతుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
కోడూరు మద్యం దుకాణం ఎదుట బారులు