తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, ఖమ్మం జిల్లాల సరిహద్దులోని మడుపల్లి చేపల చెరువు వద్ద చేపల కొనుగోలుకు ప్రజలు ఎగబడ్డారు. భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా గుమిగూడడంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని మధిరలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం.. ఈ అనుమానానికి మరింత బలం చేకూరుస్తోంది.
చేపల కోసం పోటెత్తారు... నిబంధనలు వదిలేశారు - కృష్ణా జిల్లాలో చేపల విక్రయాలు
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో.. కృష్ణా జిల్లాలోని తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మడుపల్లి చెరువు వద్ద చేపల కొనుగోలుకు ప్రజలు ఎగబడ్డారు. వైరస్ వ్యాప్తి నివారణకు కనీస జాగ్రత్త చర్యలు పాటించకపోవడం గమనార్హం.
చేపల కొనుగోలుకు బారులు తీరిన ప్రజలు