కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. వరద ప్రవాహానికి నందిగామలో ఏటిపట్టు గ్రామాలు విలవిలాడుతున్నాయి. గనిఆతుకూరు గ్రామం రెండుగా చీలిపోయింది. కావేజ్ పైకి వరద నీరు చేరడంతో గ్రామస్థులు నడుములోతు నీటిలో నడక సాగిస్తున్నారు. తోట్లవల్లూరు మండలం పరధిలో వరద గంటగంటకూ పెరుగుతోంది. తోడేళ్ళుదిబ్బ, పాములలంక, పొట్టిదిబ్బ లంక, పిల్లివాని లంక, తుమ్మలపిచ్చి లంక గ్రామాలను కృష్ణా వరద నీరు చుట్టుముట్టింది.
చాలా ప్రాంతాల్లో పసుపు ,కంద, చెరుకు, తమలపాకు, మినుము, అరటి పంటల్లోకి వరదనీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు తోట్లవల్లూరు, చాగంటిపాడు, భద్రిరాజుపాలెంలలో 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.