ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాను వీడని వరద... జలదిగ్బంధంలోనే గ్రామాలు - కృష్ణా జిల్లా నేటి వార్తలు

కృష్ణా జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉప్పొంగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ శివారులో అరగంటపాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

heavy floods with rains in krishna district
కృష్ణా జిల్లాలో వరదలు

By

Published : Oct 16, 2020, 5:10 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. గ్రామంలో విద్యుత్ సరఫరా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. పులిచింతల నుంచి భారీగా నీటి విడుదల చేస్తుండటంతో... కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గన్నవరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. చీమల వాగు, బుడమేరు, ఏలూరు కాలువలు వేగంగా ప్రవహిస్తున్నాయి. రావిరాల గ్రామంలో వరద పరిస్థితులను స్థానిక డీఎస్పీ రమణ మూర్తి, సీ.ఐ చంద్రశేఖర్ పరిశీలించారు. బాధితులకు ఆహారం పంపిణీ చేశారు.

విజయవాడ శివారులో...

విజయవాడ నగర శివారులో అరగంట పాటు కురిసిన భారీ వర్షానికి అజిత్ సింగ్ నగర్ పైపుల రోడ్డు కూడలి నుంచి పాయికాపురం, కండ్రిక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. విజయవాడ, నూజివీడు రహదారిలో నీరు నిలచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి... చిరువ్యాపారులు, వీధి వ్యాపారులు అవస్థలు ఎదుర్కొన్నారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుకు ఉత్తర్వులు

ABOUT THE AUTHOR

...view details