తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని మున్నేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్ట వద్ద ఉదయం 10 గంటలకు 9 అడుగులకు నీటిమట్టం చేరింది. జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రధాన కాలువకు సాగునీరు విడుదల చేశారు. సాగుకు సకాలంలో నీరు అందిందంటూ రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
భారీ వర్షం.. రైతుల్లో హర్షం
రాష్ట్రానికి ఎగువన ఉన్న తెలంగాణ పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండగా... పెద్ద మొత్తంలో వరద నీరు మున్నేరుకు చేరుతోంది. తాజా వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
heavy floods in krishna