కోడి.. కోడి.. నువ్వేం చేస్తావ్ అంటే.. ఉదయాన్నే కొక్కొరొకో అని కూస్తానంటుంది. కానీ... సంక్రాంతి పందెం కోళ్లు అలాకాదు.! తనను చంకలోపెట్టుకుని చంటిపిల్లాడిలా సాకిన యజమానికి కాసులు కురిపిస్తా అంటున్నాయి. అందుకే అవి 30 వేల నుంచి మొదలుకుని....లక్ష రూపాయల వరకూ పలుకుతుంటాయి. వాటిపై ఆశలుపెట్టుకున్న పందెంరాయుళ్లు....ఇక కన్నబిడ్డల్లా వాటినీ సాకుతారు. బాదం,పిస్తా, జీడిపప్పు వంటి ఎండుఫలాలేకాదు.... బరిలో తమ పౌరుషాన్ని నిలబెట్టే కోడిని మటన్, చికెన్ ఖైమా కూడా వేసి.... మేపుతారు. ఈతకొట్టిస్తారు. వ్యాయామేం చేయిస్తారు. మొత్తంగా బాగా బలిష్టంగా , ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తారు. అలాంటి పుంజుపై......లక్షల్లో పందేలు కాస్తుంటారు. యజమాని పౌరుషాన్ని నిలబెట్టాలని బరిలోకి దిగే కోళ్లలో ఒకటి విజయం సాధిస్తే.. మరొకటి కొట్లాడి కొట్లాడి.. పడిపోతుంది.
కోస కోడికి పుల్ డిమాండ్
బరిలో ప్రత్యర్థిని పడగొట్టే కోళ్లకే కాదు..పడిపోయిన కోళ్లకూ డిమాండ్ ఉంటుంది. పందెంలో ఓడిన కోడిని కోసకోడి అంటారు. సాధారణంగా రెండు నుంచి 3 కిలోల బరువుండే కోస కోడికూడా ఐదారు వేలదాకా పలుకుతోంది. పందేలు చూడడానికేకాదు.... పందెంలో చచ్చిన కోళ‌్లకోసమూ మాసం ప్రియులు పోటీపడుతుంటారు. ఐదువేలు పెడితే ఐదు కిలోల మటన్ వస్తుంది కదా....అని ప్రశ్నిస్తే.. ఆ టేస్టే వేరంటున్నారు.
రుచి చూశారంటే..వదలరు