ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

current bill: ఉండేది పూరిల్లు.. కరెంట్ బిల్లు మాత్రం వేలలో..! - krishna district latest news

రాష్ట్రంలో విద్యుత్​ వైర్లను తాకకుండానే..ప్రజలకు షాక్​ తగులుతోంది. కొన్ని నెలలుగా విద్యుత్​ సిబ్బంది నిర్వాకంతో బిల్లుల్లో పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు ఒకటి, రెండు కాదు.. ఎన్నో జరుగుతున్నాయి. మరోవైపు ఈ బిల్లులను చూసి బాధితులు లబోదిబోమంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఇద్దరికి రూ.20వేలకు పైగా కరెంట్ బిల్లులు వచ్చాయి.

current bill
current bill

By

Published : Sep 14, 2021, 7:14 AM IST

ఉండేది పూరిల్లు.. కరెంట్ బిల్లు మాత్రం వేలలో..!

కరెంట్ బిల్లుల పేరుతో అధికారులు సామాన్యులను హడలెత్తిస్తున్నారు. ఒక్క బల్బు వెలుగులో జీవనం సాగించే పేదవారికి కూడా వేలకు వేలల్లో బిల్లులు రావడంతో జనం హడలెత్తి పోతున్నారు. తాజాగా జిల్లాలోని చందర్లపాడు గ్రామంలోని కస్తల కృష్ణయ్యకు సెప్టెంబర్ నెల బిల్లు రూ.21,889 రాగా, అదే గ్రామానికి చెందిన కోట వెంకట్రావుకు రూ.24,280 బిల్లు వచ్చింది. వేలల్లో బిల్లును చూసి బాధితులు లబోదిబోమంటున్నారు. దానికి తోడుగా సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు ఇళ్ల వెంట తిరగుతూ .. కరెంట్ బిల్లు అధికంగా వచ్చిన వారికి ఫించన్ పోతాయని ప్రచారం చేస్తున్నారు. బాధితులు దిక్కు తోచక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details