ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామలో విజృంభిస్తున్న కరోనా...టీకా కోసం ఎదురు చూపులు - కృష్ణాజిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

కృష్ణాజిల్లా నందిగామలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్​ను అరికట్టేందుకు అధికారులు, పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.

నందిగామ సామాజిక ఆస్పత్రి వద్ద ప్రజలు
నందిగామ సామాజిక ఆస్పత్రి వద్ద ప్రజలు

By

Published : Apr 22, 2021, 6:02 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. అధికారులు, పాలకులు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టలేదని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే నందిగామ మండలంలో 80 మందికి అధికారికంగా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. అనధికారికంగా కొందరు ప్రైవేటు వైద్యశాలలో కొవిడ్ పరీక్షలు చేయించుకొని పాజిటివ్​గా నిర్ధారణ అయితే వేర్వేరు ప్రాంతాల్లోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందినప్పటికీ అవి రికార్డులోకి ఎక్కలేదు. కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో కరోనా వ్యాపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. నందిగామలో ప్రధాన రోడ్డు, వాసవి మార్కెట్, పాత కూరగాయల మార్కెట్, రైతు బజారు, గాంధీ సెంటర్, రథం సెంటర్, మార్కెట్ యార్డ్​లో ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. దీనిపై అధికారులు పాలకులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నందిగామ సబ్ జైల్లో నలుగురు ఖైదీలకు కరోనా సోకటంతో అధికారులు వారిని విజయవాడకు తరలించారు.

టీకాల కోసం ప్రజల ఎదురుచూపులు

నందిగామ సామాజిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో టీకాల కోసం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. టీకాలు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్తున్నారు. కనీసం రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు గడువు ముగుస్తున్న టీకా అందుబాటులో ఉండటం లేదు. దీంతో భయాందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

'పరీక్షలు నిర్వహిస్తే.. 80 లక్షల మంది కరోనాబారిన పడతారు'

'ఆక్సిజన్​ లీకేజీ' ఘటనలో వారిపై కేసు

ABOUT THE AUTHOR

...view details