మరో నాలుగైదు రోజులు.. భానుడి భగభగలే - heat_wave_condition
రాష్ట్రంలో భానుడి ప్రతాపం మరో నాలుగైదు రోజులు తీవ్రంగా ఉండనుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో 47 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఇవాళ ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని. వాతావరణశాఖ ప్రకటించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అదనంగా 4 నుంచి 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రత తీవ్రత పెరిగినట్టు ఐఎండీ ప్రకటించింది. వచ్చే నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేసింది. గుజరాత్, రాజస్థాన్ మీదుగా.. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణా, కోస్తాంధ్రల వరకూ ఉష్ణగాలులు వీస్తున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు.