అనంతపురం జిల్లాలోని త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజు పొడిగింపు వ్యవహారంపై... హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందం ప్రకారం పరిశ్రమ స్థాపించడంలో విఫలమైన... ఆ సంస్థకు లీజు పొడిగించేందుకు అనుమతి ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒప్పందం ఉల్లంఘించినప్పుడు... ఎందుకు లీజు రద్దు చేయలేదని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 14కు వాయిదా వేసింది.
'ఒప్పందం ఉల్లంఘిస్తే... ఎందుకు రద్దు చేయలేదు..?' - high court orders about Trishul Cement Company
త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజు ఎందుకు పొడిగించారని... హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 14కు వాయిదా వేసింది.
హైకోర్టులో త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజు వ్యవహరంపై విచారణ