ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బోధనాస్పత్రిగా జిల్లా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తాం' - కృష్ణా జిల్లాలోని ఆసుపత్రుల వార్తలు

కృష్ణా జిల్లాలో వైద్య కళాశాల నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. మచిలీపట్నంలోని జిల్లా ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను... వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.

health minister alla nani said Measures to develop the Machilipatnam District Hospital as a Teaching Hospital in krishna district
health minister alla nani said Measures to develop the Machilipatnam District Hospital as a Teaching Hospital in krishna district

By

Published : May 28, 2020, 8:48 AM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా ఆస్పత్రిని.... బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని... అధికారులను ఆదేశించారు. వైద్య కళాశాల నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి పరిశీలించారు.

స్థలం విషయంలో సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి ఆళ్ల నాని.. రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులన్నింటినీ అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మచిలీపట్నంలోని జిల్లా ఆస్పత్రి నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆళ్ల నాని.. సూపరింటెండెంట్, ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details