ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రయాణ ఛార్జీతో పాటు అవసరమైన వారికి రూ.2 వేలు ఇస్తాం' - alla nani about quarantine help

కొవిడ్‌ నివారణ చర్యలపై సీఎం నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలుపై మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లాక్​డౌన్ నేపథ్యంలో పేద, మధ్య తరగతి వారికి అదనపు ఆర్థిక సాయంగా మరో రూ.2 వేలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. త్వరలో దీన్ని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

health minister alla nani
'ప్రయాణ ఛార్జీతో పాటు అవసరమైన వారికి రూ.2 వేలు ఇస్తాం'

By

Published : Apr 16, 2020, 11:01 AM IST

'ప్రయాణ ఛార్జీతో పాటు అవసరమైన వారికి రూ.2 వేలు ఇస్తాం'

క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాల కల్పనకు సీఎం పలు సూచనలు చేశారని.. వారికి భోజనం, శానిటేషన్, ఇతర సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఖర్చు చేస్తున్నట్లు మంత్రి ఆళ్లనాని వివరించారు. క్వారంటైన్ ముగిసి ఇళ్లకు వెళ్ళేటప్పుడు రూ.300, మొత్తంగా ఒక్కొక్కరికి రూ.900 ఇస్తున్నామని తెలిపారు.పేద, మధ్య తరగతి వారికి అదనపు సహాయంగా మరో రూ.2 వేలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీన్ని సైతం త్వరలో అమలు చేస్తామని స్ఫష్టం చేశారు. పరికరాల విషయంలో మొదట ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ... ఇప్పుడు రాష్ట్రంలో నిత్యం 10 వేల పీపీఈలు తయారవుతున్నాయని తెలిపారు. మాస్కులు సైతం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఐసీఎంఆర్ నిబంధనలు మేరకు అందరికీ రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details