అమరావతి ప్రజావేదికలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజలకు ఆరోగ్యం, ఆనందం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.
"ఆరోగ్యాంధ్రప్రదేశే లక్ష్యం" : చంద్రబాబు - undefined
అమరావతి ప్రజావేదికలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
దేశంలో మొదిటిసారిగా పెద్ద ఎత్తున ఈ సబ్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ బాగా పెరిగిందన్న ఆయన... ఇకపై వైద్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోగులకు సలహాలు ఇస్తారని తెలిపారు. ఈ ఉప కేంద్రాలకు రూ. 2,800 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులు కేటాయిస్తామన్నారు. 5 వేల 700 రూపాయలు ఖర్చయ్యే వైద్య పరీక్షలను రూ. 570 కి తగ్గించామని చెప్పారు.
ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖల్లో ప్రక్షాళన చేపట్టామని వెల్లడించారు. విజయనగరం, ఏలూరులో ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారులు చేస్తున్న కృషి సీఎం అభినందించారు.
TAGGED:
health is wealth