దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచామన్నారు. లాక్ డౌన్ అన్‌లాక్ ప్రారంభమయ్యాక కేసుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల కోసం 19 ప్రయోగశాలలు ఏర్పాటు చేశామని... ఇప్పటివరకు 9.70 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించి.. పది లక్షలకు చేరువగా వచ్చామన్నారు.
మృతదేహంలో ఆరుగంటల తర్వాత వైరస్ చచ్చిపోతుందని జవహర్ రెడ్డి తెలిపారు. వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందనే అంశంపై అధ్యయనం చేస్తున్నామన్నారు. నిర్మాణ రంగం, వ్యవసాయ రంగం, మార్కెట్లలోని కూలీలకు కరోనా పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు.