ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బడి కాదు... బంగారు భవిష్యత్​కు బాట వేసే గుడి - heal paradise company latest news in thotapalli

పాఠశాల అంటే చదువు చెప్పే బడే కాదు... విద్యార్థుల బంగారు భవిష్యత్​కు బాటలు వేసే గుడి. విద్యతో పాటు పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవలంభించాల్సిన విధానాలను చెప్పడమే కాదు చేసి చూపిస్తోంది ఓ విద్యా సంస్థ. ఆదరణ కరువైన పిల్లలను అక్కున చేర్చకుని వారికి ఏ లోటు లేకుండా చుస్తోంది తోటపల్లిలోని హీల్ పారడైస్ సంస్థ.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/14-December-2019/5373613_436_5373613_1576330997133.png
heal paradise company paving the way to a student golden future

By

Published : Jan 1, 2020, 10:28 AM IST

ఆదరణ చూపుతున్న తోటపల్లి హీల్ పారడైస్ సంస్థ

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి హీల్ పారడైస్ సంస్థ. అక్కడ ఉన్న వారంతా ఆదరణ కరువైన పిల్లలే కానీ వారికి ఇప్పుడు ఆ లోటు లేదు. విధి వారిని వెక్కిరించిన మానవత్వం చేరదీసింది. పోషణ బాధ్యత మాత్రమే కాకుండా విద్య కోసం హీల్ ప్యారడైజ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆధునిక తరగతి గదులు... నాణ్యమైన బోధన... ఆరోగ్యకరమైన ఆహారం... విశాలమైన క్రీడామైదానం... యోగ శిక్షణ ఇలా ఎన్నో వనరులు, వసతులు కల్పిస్తోంది ఆ విద్యా సంస్థ.

కూరగాయలను పండిస్తారిలా...
సౌకర్యాలతో పాటు పాఠశాల ఆవరణలోనే కూరగాయలు.. పండ్ల మొక్కలను పెంచేందుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. వీటి ఎదుగుదలకు విద్యార్థులు స్వయంగా తయారుచేసిన ఎరువులను వాడుతున్నారు. రోజూ వచ్చే భోజన పదార్థాల కూరగాయల వ్యర్థాలతో "ఆగ "ప్లాంట్ పద్ధతిలో సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. మొదట వ్యర్థ పదార్థాలను కొబ్బరి పొట్టు మైక్రాన్ ద్రవం కలిపి 45 రోజులు మగ్గ పెడతారు. ఇలా తయారైన మిశ్రమాన్ని రోజంతా ఎండబెట్టి ఎరువుగా మారుస్తారు. దీనిని తమకే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల రైతులకు అందిస్తున్నారు.

నీటీని శుద్ధి ప్రక్రియ
సేంద్రియ ఎరువులు తయారు చేయటంతోపాటు నిత్య అవసరాలకు వాడే నీటిని శుద్ధి చేస్తారు. సీ వెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్​ విధానం ద్వారా నీటి శుద్ధి ప్రక్రియ జరుగుతుంది. మూడు అంశాల్లో శుద్ధి చేసిన నీటిని ఇక్కడ మొక్కలకు పేడతారు. ఇలా వ్యర్ధాలను వృథా పోనీయకుండా ఎన్నో రకాల కూర కాయలను పండ్లను పండిస్తున్నారు.

ఇదీ చూడండి: పదెకరాల్లో ప్రకృతి సేద్యం...పది మందికి ఆదర్శం..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details