కృష్ణా జిల్లాలో హెచ్సీఎల్ పైపులైను బాధిత రైతులు రెండోరోజు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే.. చందర్లపాడు మండలం మెజిస్ట్రేట్ రైతుల దగ్గరకు వచ్చి వారితో మాట్లాడారు. పైపులైను బాధిత రైతులు, రైతు సంఘం, సీపీఎం నాయకులు పైపులైను విషయంపై రేపు కలెక్టర్ చర్చలకు రమ్మన్నారని చెప్పారు. చర్చలకు వెళ్లి వచ్చేదాకా పైపులైను పనులు ఆపాలని రైతులు కోరారు.
చర్చకి రమ్మన్నారు.. పైపు లైన్ వేయబోయారు - HCL pipeline quarrel in chandralapadu
కృష్ణా జిల్లాలో హెచ్సీఎల్ పైపులైను బాధిత రైతులు నిరసన చేస్తుంటే అధికారులు సర్దిచెప్పి చర్చకు పిలిచారు. కానీ, అధికారులు హెచ్సీఎల్ పక్షాన నిలబడ్డారు. రైతులు లేకుండా పైప్లైన్ వేస్తుంటే పెద్ద ఎత్తున రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతుల తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని రైతులు పొలాల్లోనే కూర్చుని డిమాండ్ చేశారు.
HCL pipeline
ఎమ్మార్వో, చందర్లపాడు ఎస్ఐ హామీతో పొలాల దగ్గర నుంచి రైతులు వెనుతిరిగారు. కానీ, హెచ్సీఎల్ అధికారుల పక్షాన అధికారులు నిలబడ్డారు. బాధిత రైతులు లేకుండా పైప్లైన్ వేయబోయారు. దీంతో పెద్ద ఎత్తున రైతులు అడ్డుకున్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని అధికారులకు చెప్పి అక్కడే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని రైతులు పొలాల్లోనే కూర్చుని డిమాండ్ చేశారు.