వినియోగదారుల ఫోరాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు . తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం.. ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఆధార్టీని ఏర్పాటు చేయాల్సి ఉందని జీపీ బదులిచ్చారు . భర్తీ చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. చర్యల్లో పురోగతి వివరాల్ని తెలపాలని ఆదేశాలు జారీచేసింది.
ఆ పోస్టుల భర్తీలో పురోగతి తెలపండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - ఏపీ వినియోగదారుల ఫోరాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు
రాష్ట్ర వినియోగదారుల కమిషన్లో మహిళా సభ్యురాలు పోస్టుతో పాటు.. జిల్లా వినియోగదారుల ఫోరాల్లో ఖాళీగా ఉన్న అధ్యక్షులు , సభ్యులు , మహిళా సభ్యుల పోస్టుల భర్తీ విషయంలో పురోగతి తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను నెల రోజులకు వాయిదా వేసింది.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి , జస్టిస్ బి . కృష్ణమోహన్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
HC On Consumer Forum in ap