కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లిలోని శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా పరిమిత సంఖ్యలో అర్చక స్వాములు మాత్రమే ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి పుణ్యాహవచనం, మండపారాధన, అఖండ స్థాపన, దీక్షా ధారణ, శ్రీ వారికి మాన్యుసూక్త అభిషేకం, సింధూరార్చన, లక్ష్మి గణపతి కళ్యాణం నిర్వహించారు.
17 వ తేదీ ఆదివారం హనుమజ్జయంతి ప్రధాన ఉత్సవం జరగనుంది. 18 వ తేదీతో ఉత్సవాలు ముగియనున్నాయి. కరోనా లాక్డౌన్ కారణంగా.. ఈ ఏడాదికి భక్తులంతా ఇంటి నుంచే స్వామిని ధ్యానించాలని పూాజారులు కోరారు. ఉత్సవాల మొదటిరోజు సాయంత్రం శ్రీవారికి దర్బారు సేవ అనంతరం ఆలయం నిర్వాహకులు విశేష హారతులు ఇచ్చారు. కప్పగన్తు లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో పూజాదికాలు జరుగుతున్నాయి.