ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరాడంబరంగా హనుమాన్ జయంతి - Hanuman Jayanti Celebrations kadapa district

హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకోని పలు జిల్లాలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాక్​డౌన్ కారణంగా నిరాడంబరంగా ఆంజనేయస్వామి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.

Hanuman Jayanti Celebrations
నిరాడంబరంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

By

Published : May 16, 2020, 10:00 PM IST

కృష్ణా జిల్లాలో...

హనుమాన్​ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లిలోని శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో 64వ హనుమజ్జయంతి మహోత్సవాలు మూడోరోజుకు చేరుకున్నాయి. శనివారం నాటి కార్యక్రమాల్లో శ్రీవారికి సుప్రభాత సేవ అనంతరం గురుపూజ చేసి, నిత్యార్చనలు నిర్వహించారు.

కడప జిల్లాలో...

రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన కడప జిల్లాలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ సందర్భంగా భక్తులకు ఎటువంటి పూజలకు అనుమతులు కల్పించలేదు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, రాజా స్వామి ఆధ్వర్యంలో ఆలయ సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు.

ప్రకాశం జిల్లాలో...

ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో వేద పండితులు హనుమాన్ జయంతి మహోత్సవం నిర్వహించారు. లాక్​డౌన్ విధించిన కారణంగా దేవస్థానం వేద పండితులు ఏకాంతంగా పూజలు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details