ఉత్సాహంగా ముగిసిన హాయ్బుజ్జీ క్విజ్ పోటీలు బాలల దినోత్సవం సందర్భంగా ఈనాడు హాయ్బుజ్జీ, తెలుగు వెలుగు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలల్లో క్విజ్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. 5, 6, 7 తరగతుల విద్యార్థులు జూనియర్ విభాగంలో.. 8, 9, 10 తరగతుల విద్యార్థులు సీనియర్ విభాగంలో పోటీ పడ్డారు. మూడు దశల్లో జరిగిన పోటీల్లో ప్రతి విభాగంలోనూ ముగ్గురు చొప్పున విజేతలుగా ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. జూనియర్ విభాగంలో విజయనగరానికి చెందిన టి.విశ్వక్ మెుదటి బహుమతి గెలుచుకోగా, సీనియర్ విభాగంలో తిరుపతికి చెందిన టి.సుహాసిని గెలుచుకుంది. విజేతలకు మెుదటి బహుమతిగా రూ.20 వేలు, రెండో బహుమతిగా రూ.10 వేలు, మూడో బహుమతిగా రూ.5 వేలు నగదు, ప్రశంసా పత్రాలు అందజేశారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత పేర్లి దాసు, రచయిత్రి డాక్టర్ కావూరి సత్యవతి, ఈనాడు విజయవాడ యూనిట్ మేనేజర్ సి.శేఖర్ వీటిని విజేతలకు అందించారు.
ఇదీ చదవండి: