కృష్ణా జల్లా నందిగామ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు.. లక్షలాది రూపాయల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏర్పడిన తర్వాత జిల్లాలో అక్రమ రవాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు బ్యూరో జిల్లా ఏఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
అక్రమ గుట్కా రవాణా దందాపై 5 కేసులు నమోదు చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయా కేసుల్లో రూ.57.5 లక్షల విలువ చేసే గుట్కాతో పాటు 65వేల నగదు, రెండు డీసీఎం వాహనాలు, ఒక బొలెరో వాహనం, రెండు కేజీల గంజాయి, 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.