ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూరగాయల వాహనంలో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - krishna district latest updates

కృష్ణా జిల్లా కంచికచర్ల జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానంతో కూరగాయల వాహనాన్ని సోదా చేయగా అందులో గుట్కా, ఖైనీ ప్యాకెట్లు లభ్యమయ్యియి. వీటితో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

gutka packets seized by kanchikacherla police
గుట్కా ప్యాకెట్లు పట్టుకున్న కంచికచర్ల పోలీసులు

By

Published : Apr 3, 2020, 2:34 PM IST

గుట్కా , ఖైనీ ప్యాకెట్లు తీసుకెళ్తున్న వాహనాన్ని కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు అడ్డుకున్నారు. కంచికచర్ల జాతీయ రహదారిపై కూరగాయలతో వెళుతున్న వాహనాన్ని అనుమానంతో తనిఖీలు చేశారు. అందులో 11 గుట్కా ప్యాకెట్ల బస్తాలు లభ్యమయ్యాయి. వీటి విలువ రూ. 3,50,000 ఉంటుందని అంచనా వేశారు. అంతే మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details