ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ మొత్తంలో గుట్కా, ఖైనీ స్వాధీనం - మచిలీపట్నం

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

krishna distrct
భారీ మొత్తంలో గుట్కా, ఖైనీ స్వాధీనం

By

Published : Jul 25, 2020, 6:56 PM IST

కృష్ణాజిల్లా మచిలీపట్నం ఆర్.పేట పోలీసు స్టేషన్​కు సమీపంలో ఖైనీ, గుట్కా ప్యాకెట్లను భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడు లెనిన్​ను అదుపులోకి తీసుకున్నారు. కొంత కాలంగా లెనిన్ గుట్కా, ఖైనీలు అమ్ముతున్నాడనే సమాచారంతో నిఘా పెట్టి భారీ డంపును ఎస్ఈబీ ఏఎస్పీ వకుల్ జిందాల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలపూడి సీఐ వెంకట నారాయణ, ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

ABOUT THE AUTHOR

...view details