విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర కూడలి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న 42 బస్తాల ఖైనీ, గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీటి విలువ 1.81 లక్షల ఉంటుందని ఎస్సై నీలకంఠం తెలిపారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆటోలో తరలిస్తున్న రూ. 1.81 లక్షల గుట్కా, ఖైనీ ప్యాకెట్ల పట్టివేత - ఎస్. కోట తాజా వార్తలు
బొడ్డవర కూడలిలో వాహన తనిఖీల్లో భాగంగా ఆటోలో దొరికిన ఖైనీ, గుట్కాల రవాణా వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై నీలకంఠం తెలిపారు. ఆటోలో 42 బస్తాల ఖైనీ, గుట్కాలు ఉన్నాయన్నారు. వీటి విలువ రూ. 1.81 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత