ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

8 నుంచి విజయవాడలో గురునానక్ జయంతి​ ఉత్సవాలు - గురునానక్ జయంతి ఉత్సవాలు

హిందువూ లేడు, ముస్లిమూ లేడు’’అని మత సామరస్య బోధనలను వ్యాప్తి చేసిన శిక్కుల గురువు గురునానక్ 550 వ జయంతి ఉత్సవాలను కృష్ణా జిల్లా విజయవాడలో శ్రీ గురు సింగ్ సభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. నంవంబరు 8వ నుంచి 10వ తేదీ వరకూ జరిగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే...

8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గురునానక్ జయంతి​ ఉత్సవాలు

By

Published : Nov 5, 2019, 8:03 PM IST

8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గురునానక్ జయంతి​ ఉత్సవాలు

విజయవాడలో గురుద్వారా శ్రీ గురు సింగ్‌ సభ ఆధ్వర్యంలో శిక్కుల గురువు 550వ గురునానక్ ప్రకాష్ ఉత్సవ్​ని ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ గురు సింగ్‌ సభ కమిటీ సభ్యులు గుర్జిత్ సింగ్‌ సహాని చెప్పారు. ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకూ గురునానక్ 550వ జయంతి ఉత్సవాలు అత్యంత భక్తి, శ్రద్ధలతో నిర్వహిస్తామని.. సర్వమతస్థులు ఇందులో ఆహ్వనితులేన్నారు. సర్వమత, సర్వమానవ సమానత్వం ప్రధానమని.. మతాలు ఏన్నైనా దేవుడు ఒక్కడే అని నమ్ముతామని తెలిపారు. 8వ తేదీ వరకూ ఉదయాన్నే దైవ ప్రార్థనలు చేస్తూ ప్రభాత్‌ పేరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. తమ మత గ్రంథాన్ని 48 గంటలపాటు నిర్విరామ అఖండ పాఠ్ పారాయణ కార్యక్రమం చేపడతామని... పంజాబ్​లోని అమృతసర్‌ స్వర్ణదేవాలయ అర్చకులు వచ్చి ఇక్కడి అర్చకులతో పూజాదికాలు చేయనున్నారన్నారు. 10న ప్రత్యేక ఆకర్షణగా తమ మతాచార ఆయుధాలతో విన్యాసాలు చేస్తూ... నగర కీర్తన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 12 వతేదీన గురునానక్ జయంతిని తమ పంజాబీలందరితో పాటు అన్యమతస్తులతో కలిసి ఘనంగా జరుపుకుంటామని సహానీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details