gun miss fire: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ హెడ్ కానిస్టేబుల్ చేతిలో గన్ మిస్ ఫైర్ అయింది. గాయపడిన అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలోని.. ఈవీఎం గోదాం వద్ద ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వై.శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నాడు.
Gun miss fire: తుపాకీ శుభ్రం చేస్తుండగా చేతిలోనే పేలి.. - కృష్ణాజిల్లా నేర వార్తలు
Gun miss fire: ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ తుపాకీ శుభ్రం చేస్తుండగా.. చేతిలోనే గన్ మిస్ ఫైర్ అయింది. గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్పీ విచారణకు ఆదేశించారు.
హెడ్ కానిస్టేబుల్ చేతిలో గన్ మిస్ ఫైర్
మధ్యాహ్నం సమయంలో అతను తుపాకీ శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్ అయింది. దీంతో అతడికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. గాయపడిన అతన్ని మెుదట జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్పీ సిదార్థ్ కౌశల్ విచారణకు ఆదేశించారు.
ఇదీ చదవండి:
Sea Came Farward in Vizag: విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం
Last Updated : Dec 5, 2021, 5:24 PM IST