ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైఎస్‌ఆర్‌ చేయూతకు మార్గదర్శకాలు' - వైఎస్‌ఆర్‌ చేయూత పథకం మార్గదర్శకాలు

వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీలకు చెందిన 45నుంచి 60ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. నాలుగు విడతల్లో, నాలుగేళ్లలో రూ.75వేల రూపాయల సాయం అందిస్తారు.

Guidelines for ysr cheyutha scheme execution
వైఎస్‌ఆర్‌ చేయూత

By

Published : Jun 13, 2020, 11:59 AM IST

వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీలకు చెందిన 45నుంచి 60ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. నాలుగు విడతల్లో, నాలుగేళ్లలో రూ.75వేల రూపాయల సాయం అందిస్తారు. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే..

  • గ్రామీణ మహిళలకు కుటుంబ ఆదాయం రూ.10వేలకు, పట్టణ ప్రాంతాల వారికి రూ.12 వేలకు మించకూడదు.
  • కుటుంబానికి మూడెకరాల కంటే ఎక్కువ సాగు భూమి ఉండకూడదు.
  • పదిఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉండకూడదు.
  • ప్రభుత్వ ఉద్యోగులు, పింఛను పొందే విశ్రాంత ఉద్యోగులు ఉండరాదు.
  • 4 చక్రాల వాహనం ఉంటే పథకం వర్తించదు. (ట్యాక్సీ, ట్రాక్టర్‌, ఆటోలకు మినహాయింపు)
  • నెలవారీ విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లకు మించకూడదు.

ABOUT THE AUTHOR

...view details