వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుందని.... పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి తాము ప్రయత్నిస్తుంటే... ప్రతిపక్షాలు అడ్డు పడుతున్నాయని మంత్రి కొడాలి నాని విమర్శించారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు నూతన మార్కెట్ యార్డ్ కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరో మంత్రి పేర్ని నానితో కలిసి పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి: కొడాలి నాని - గుడ్లవల్లేరు వార్తలు
వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఏ పథకం ప్రవేశ పెట్టినా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మంత్రి కొడాలి నాని విమర్శించారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు నూతన మార్కెట్ యార్డ్ కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరో మంత్రి పేర్ని నానితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఘనంగా గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ ప్రమాణసీకారోత్సవం
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గల్లీ నుంచి దిల్లీ వరకు తన మనుషులను పెట్టుకొని జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమానికి అడ్డుతగిలేలా ప్రయత్నిస్తున్నారని ఈ ప్రయత్నాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి:ఏ రాష్ట్రంపై పక్షపాతం లేదు... ఏపీకి కృష్ణా నదీ బోర్డు లేఖ