ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 14, 2020, 5:57 PM IST

ETV Bharat / state

రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు జరిగే ఈ పరీక్షల కోసం హైదరాబాద్ సహా రాష్ట్రంలో 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ట్యాబ్​ల ద్వారా పరీక్ష నిర్వహించారు.

group-1-mains-exams-started-in-andhrapradhesh
రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం

రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8.45 గంటల నుంచి 9.45 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. సమయం ముగిసిన తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష రాయటానికి అనుమతించలేదు.

ఈ పరీక్షల కోసం హైదరాబాద్ సహా రాష్ట్రంలో 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాన్ని తొలిసారిగా ట్యాబ్​లో పొందుపరిచి అభ్యర్థులకు ఇచ్చారు. ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నాపత్రాలను అందుబాటులో ఉంచారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. హాల్ టికెట్​తో పాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు తీసుకువచ్చిన వారిని మాత్రమే పరీక్ష రాసేందుకు అనుమతించారు. ట్యాబ్​ల ద్వారా పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లండి.. కానీ సమయం ఇవ్వలేం: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details