డిసెంబర్ 14 నుంచి నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని.. అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరారు. హైకోర్టు తీర్పుతో ఈ నెల 11న గ్రూప్-1 మెయిన్స్‌కు అర్హత పొందిన 1300 మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.ఎస్.ఆర్ ఆంజనేయులును కలిశారు. పరీక్షకు కేవలం 45 రోజులు మాత్రమే గడువుందని.. తక్కువ సమయంలో మెయిన్స్ పరీక్షకు తాము సిద్దం కాలేమని తెలిపారు. మెయిన్స్ జరిగే రోజునే పలు యూపీఎస్సీ, రైల్వే, స్టాఫ్ సెలక్షన్, ఏపీ సెట్ పరీక్షలు ఉన్నట్లు తెలిపారు. చాలామంది అభ్యర్థులు ఆ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేశారని.. రెండు పరీక్షలకూ హాజరు కాలేని పరిస్ధితి ఉంటుందని వివరించారు.
'గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయండి' - GROUP 1 CANDIDATES
డిసెంబర్ 14న జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ... అభ్యర్థులు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.ఎస్.ఆర్ ఆంజనేయులను కోరారు. అదే రోజు చాలా ఉద్యోగాలకు పరీక్షలు ఉన్నందునా.. అభ్యర్థులు ఇబ్బందులుపడతారని తెలిపారు.
గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయండి