కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవొలులో కాట్రగడ్డ బాపినీడు, భారతిల ట్రస్ట్ తరఫున గ్రామస్థుడు కాట్రగడ్డ రమేష్ బాబు.. సొంత ఖర్చుతో దాదాపు వెయ్యి కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. గుడివాడ ఆర్డీవో శ్రీనుకుమార్, డీఎస్పీ సత్యానందం వీటిని పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేసిన రమేష్‌ను అధికారులు అభినందించారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పామర్రులో వెయ్యి కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ - corna news in krishna dst
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదల ఇబ్బందులను గుర్తించి వారికి సహాయం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రులో భారతి ట్రస్ట్ తరఫున గ్రామ పెద్ద కాట్రగడ్డ రమేష్ బాబు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

grossaries disributes in krishna dst due to corona loskcown