ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ తిరుపతమ్మ ఆలయంలో ఆహ్లాదం పంచుతున్న పచ్చదనం

కృష్ణా జిల్లా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తర్వాత అతి పెద్ద ఆలయంగా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని పచ్చదనం.. భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతోంది.

By

Published : Dec 30, 2020, 1:13 PM IST

Greenery in Sri Tirupatamma Temple
శ్రీ తిరుపతమ్మ ఆలయంలో పచ్చదనం

పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయం.. ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని సైతం భక్తులకు అందిస్తోంది. ఆలయ ప్రాంగణం రకరకాల మొక్కలతో పచ్చదనం నిండి కనువిందు చేస్తోంది. అమ్మవారిపై భక్తి పారవశ్యంతో ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇక్కడి వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతోంది.

పలురకాల మొక్కలు ఆలయానికి కొత్త కళను తీసుకువస్తున్నాయి. ఆలయ ముఖమండపం చుట్టూరా ఉన్న మొక్కలు చూస్తూ.. భక్తులు ఆనంద పారవశ్యానికి లోనవుతున్నారు. కృష్ణా జిల్లాలో ఏ ఆలయంలో లేన విధంగా ఇక్కడి అధికారులు, సిబ్బంది పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వటం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details