రెవెన్యూ శాఖలో అంకితభావం, నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపం గొర్రెపాటి పిచ్చేస్వరరావు అని రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, డీఏఓ సీహెచ్. చంద్రశేఖర రావు పేర్కొన్నారు. లంక భూములను సాగు చేసుకుంటున్న 250 ఎకరాలు పేదలకు పట్టాలు మంజూరులో విశేష కృషి చేశారన్నారు. ఘంటసాల మండలం కొడాలి -2 వీఆర్వో గొర్రెపాటి పిచ్చేశ్వరరావు ఉద్యోగ విరమణ సందర్భంగా మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. తహసీల్దార్ సీహెచ్.శిరీషాదేవి అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో ఆర్డీఓ కార్యాలయ డీటీ శివరామకృష్ణ, డివైఎస్ఓ వెంకటేశ్వరరావు, ఘంటసాల డీటీ మల్లేశ్వరరావు, ఆర్ఐ సుధాకర్, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది, మిత్రులు పాల్గొన్నారు.
వీఆర్వో గొర్రెపాటి పిచ్చేశ్వరరావుకు ఘన సన్మానం..
ఉద్యోగ విరమణ చేసిన గొర్రెపాటి పిచ్చేశ్వరరావు,సంధ్యారాణి దంపతులను ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో అంకితభావం, నీతి నిజాయితీలకు ప్రతీక గొర్రెపాటి పిచ్చేశ్వరరావు అని రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, డీఏఓ సీహెచ్. చంద్రశేఖర రావులు విజయవాడలో పేర్కొన్నారు.
వీఆర్వో గొర్రెపాటి పిచ్చేశ్వరరావుకు ఘన సన్మానం