వైఎస్సాఆర్ వాహన మిత్ర పథకం లబ్ధిదారులకు రూ.పదివేలు ఆర్ధిక సహాయం కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, ఎంపీలు, అధికారులు ప్రారంభించారు. విజయవాడలోని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పాలనాధికారి ఇంతియాజ్.. సమక్షంలో ఆటో, టాక్సీ డ్రైవర్లకు నగదును అందించారు. లాక్డౌన్తో ఆటో, టాక్సీ డ్రైవర్ల ఇబ్బందులను గమనించి ఆర్థిక సహాయం చేయడం ద్వారా ప్రభుత్వం వారిలో భరోసా నింపిందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ఆటోడ్రైవర్లకు ఇచ్చే సహాయాన్ని బ్యాంకులు తమ పాత బకాయిలు జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తే 1902 ఫోన్ నెంబరుకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు.
వైఎస్సాఆర్ వాహన మిత్ర పథకం ప్రారంభం - వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.పది వేలు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిన వైఎస్సాఆర్ వాహన మిత్ర పథకాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు ప్రారంభించారు.
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ప్రారంభం