ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిద్ధార్థ వైద్య కళాశాలలో ఘనంగా స్నాతకోత్సవం - krishna district latest news

కృష్ణా జిల్లా చిన్నఅవుట్లపల్లిలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు కళాశాల యాజమాన్యం డాక్టరేట్లు అందించింది.

grand graduation ceremony at Siddhartha Medical College
సిద్ధార్థ వైద్య కళాశాలలో ఘనంగా స్నాతకోత్సవం

By

Published : Apr 11, 2021, 12:29 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుట్లపల్లిలోని సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో 2015 బీడీఎస్, 2017 ఎండీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధార్థ వైద్య కళాశాల పరిశోధన విభాగం అధ్యాపకులు ఈశ్వర్ హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ రామోజీరావు, అకాడమీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, డైరెక్టర్ జనరల్ నాగేశ్వరరావు తదితరులతో కలిసి విద్యార్థులకు ప్రొఫెసర్ ఈశ్వర్ డాక్టరేట్​లు అందించారు. పట్టాలు అందుకున్న విద్యార్థులు ఉత్తమ వైద్యులుగా ఎదిగి, సమాజంలో మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details