''అధికారులూ.. మాట మార్చకండి.. మా కొలువు మాకివ్వండి'' - grama sachivalayam candidates latest updates in vijayawada
గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన పలువురు అభ్యర్థులు విజయవాడలో ఆందోళనకు దిగారు. సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. కాల్ లెటర్ ఇచ్చి.. వెరిఫికేషన్ పూర్తి చేసినా ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో హార్టీ కల్చర్ విభాగంలో అర్హత సాధించినా... ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ కొందరు అభ్యర్థులు విజయవాడలో ఆందోళనకు దిగారు. కృష్ణలంక వద్ద సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ధ్రువపత్రాలు పరిశీలించి, కాల్ లెటర్ పంపిన తర్వాత.. హార్టీకల్చర్ ఉద్యోగాలకు డిగ్రీలో బీజెడ్సీ చేసిన అభ్యర్థులు అర్హులు కాదనడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్‌లో బీజెడ్సీ అభ్యర్థులూ అర్హులని చెప్పిన అధికారులు.. ఇప్పుడు మాట మార్చారని వాపోయారు. అభ్యర్థుల ఆవేదనపై ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తోన్న వివరాలివి..!